అవసరమైతే హౌస్ అరెస్టులు

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హెచ్చరిక

Nimmagadda Ramesh kumar
Nimmagadda Ramesh kumar

Kurnool: . బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హెచ్చరింxc చారు. అవసరమైతే వారిని హౌస్ అరెస్టు చేస్తామన్నారు. ఆయన కర్నూలు జిల్లా పర్యటన ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  ఏకగ్రీవాలపై పలు పార్టీల నేతలు గవర్నర్‌ను కలిశారని తెలిపారు.

ఏకగ్రీవాల కోసం ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం లేదని నిమ్మగడ్డ తప్పుబట్టారు. పత్రికల్లో ప్రకటన ఇచ్చిన అధికారులను వివరణ కోరామని తెలిపారు.

ఎస్‌ఈసీకి తెలియకుండా ప్రకటనలు ఎలా ఇస్తారు? అని నిమ్మగడ్డ ప్రశ్నించారు. సామరస్యంగా ఏకగ్రీవాలు చేయడం సరైన సంస్కృతి అని వ్యాఖ్యానించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/