ఏపీ ప్ర‌భుత్వంపై య‌న‌మ‌ల కీలక ఆరోప‌ణ‌లు

వైస్సార్సీపీ నేత‌ల జేబుల్లోకి రూ.48వేల కోట్లు

అమరావతి: టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఏపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రూ.48 వేల‌కోట్లు వైస్సార్సీపీ నేత‌ల జేబుల్లోకి వెళ్లాయంటూ య‌న‌మ‌ల ఆరోపించారు. రూ.48వేల కోట్ల దుర్వినియోగంపై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాల‌న్నారు.రూ.1.78ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు పెడితే రూ.48వేల కోట్ల‌కు లెక్క‌ల్లేవు అన్నారు. ఈ మేర‌కు నిధులు ప‌క్క‌దారి ప‌ట్టాయ‌న్నారు. ప్ర‌జ‌ల కోసం రూ.48వేల కోట్లు ఖ‌ర్చు పెడితే లెక్క‌లు ఎందుకు చెప్ప‌లేక‌పోతోంద‌న్నారు. రూ.48వేల కోట్ల ఖ‌ర్చుకు సంబంధించి స్పెష‌ల్ బిల్లుల పేరుతో ఖ‌ర్చు పెట్టామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంద‌న్నారు య‌న‌మ‌ల‌. స్పెష‌ల్ బిల్లుల‌నేవి ట్రెజ‌రీ కోడ్ లోనే లేద‌న్నారు.ఈ మేర‌కు భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జ‌రుగుతోంద‌న్నారు. కాబ‌ట్టి కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.ఏపీ విష‌యంలో కేంద్రం ఆర్టిక‌ల్ 360ని అమ‌లు చేయాల‌న్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/