దసరా వేడుకల్లో పరస్పరం దాడులు చేసుకున్న బిజెపి – టిఆర్ఎస్ కార్యకర్తలు

దసరా పండగ వేళ బిజెపి – టిఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో చోటుచేసుకుంది. తుంగతుర్తిలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ నేతలు , కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా రామాలయం దగ్గర జమ్మిచెట్టు పూజ జరుగుతుండగా..ఇరు పార్టీల నేతలు ఒక్కసారిగా గొడవకు దిగారు. కుర్చీలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఘటనలో రెండు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘటన తో ప్రజలంతా పరుగులు పెట్టారు.

ఇక ఇదిలా ఉంటె దసరా పండగ వేళ టిఆర్ఎస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసి కార్య కర్తల్లో జోష్ నింపారు. టిఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ చేసారు. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మాన పత్రంపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. తీర్మానం ప్రతిని సీఎం కేసీఆర్‌ చదివి.. సభ్యుల ఆమోదం పొందారు. మరోపక్క కేసీఆర్ బీఆర్ఎస్ ఫై బిజెపి , కాంగ్రెస్ నేతలు సెటైర్లు , విమర్శలు చేస్తున్నారు.