టిఆర్ఎస్ మంత్రులు , ఎమ్మెల్యేలు లైసెన్స్‌డ్‌ గుండాలు అయిపోయారు – బండి సంజయ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి టిఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. టిఆర్ఎస్ మంత్రులు , ఎమ్మెల్యేలు లైసెన్స్‌డ్‌ గుండాలు అయిపోయారని ఫైర్ అయ్యారు. మోత్కూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రులు గాల్లోకి కాల్పులు జరుపుతుంటే రజాకార్ల పాలన మళ్లీ వచ్చిందా అనిపిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈడీని వాడుకోవాలని చూస్తే తెలంగాణలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ బొమ్మతో తిరిగితే ఓట్లు పడే రోజులు ఎప్పుడో పోయాయన్నారు. టీఆర్‌ఎస్‌కు అనుసంధానంగా ఉన్న అధికారుల లిస్ట్‌ తీస్తున్నామని.. అధికారంలోకి వచ్చాక వాళ్ల సంగతి చూస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పొయిందన్న ఆయన… దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం కల అన్నారు. టిఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న ఆయన… దుబ్బాక ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు మద్దతు పలికిందని ఆరోపించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారే తప్ప… ఏనాడు కాంగ్రెస్ పార్టీని కించపరిచేలా మాట్లాడలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.