టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం పందికి లిప్ స్టిక్ పెట్టినట్లు ఉంది – బండి సంజయ్

bjp-bandi-sanjay-replies-to-ktr-tweet

కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం పందికి లిప్ స్టిక్ పెట్టినట్లు ఉందంటూ విమర్శించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దసరా పర్వదినాన జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇకపై టిఆర్ఎస్ ‘బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి )’ గా మారింది. కాగా బీఆర్ఎస్ ఫై బిజెపి నేతలు వారి స్టైల్ లో సెటైర్లు , విమర్శలు చేస్తున్నారు.

ఇప్పటికే పలువురు బిజెపి నేతలు బీఆర్ఎస్ ఫై స్పందించగా..బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం పందికి లిప్ స్టిక్ పెట్టినట్లు ఉంది. ట్విట్టర్ టిల్లు కేటీఆరేమో కేసీఆర్ ను గేమ్ చేంజర్ అంటున్నారు. కానీ, తన తండి నేమ్ చెంజర్ అయ్యారు. అంతిమంగా ప్రజలే కేసీఆర్ ను మార్చుతారు’ అంటూ ట్విట్టర్ లో కామెంట్స్ చేశారు.