అనుష్క-నవీన్ పోలిశెట్టి మూవీ టైటిల్ ఇదే..

అనుష్క – నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తున్న మూవీ కి టైటిల్ ఫిక్స్ చేసారు. అనుష్క తెరపై కనిపించి చాల కాలం అవుతుంది. ఆమెను తెరపై చూసేందుకు అభిమానులు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో యూవీ క్రియేషన్స్ వారు అనుష్క తో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ‘జాతి రత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తుండగా ‘రా రా కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు.

మొన్నటి వరకు ఈ చిత్రానికి ఏ టైటిల్ పెడతారో అని అంత ఆసక్తి గా ఎదురుచూస్తున్న క్రమంలో మేకర్స్ టైటిల్ ను రివీల్ చేస్తూ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే టైటిల్ ను పెట్టారు. అలాగే టైటిల్ ఫస్ట్ లుక్ లో నవీన్, అనుష్క ల లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. అనుష్క కెరీర్ లో 48వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రథన్ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ లో తెలిపారు.