నేడు మునుగోడులో నామినేషన్లు వేయనున్న టిఆర్‌ఎస్‌, బిజెపి అభ్యర్థులు..

trs-and-bjp-candidates-will-file-nomination-in-munugode-bypoll-today

హైదరాబాద్ః మునుగోడులో నామినేషన్ల సందడి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు టిఆర్‌ఎస్‌, బిజెపి అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఉదయం 11 గంటలకు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి నామినేషన్‌ వేస్తారు. మధ్యాహ్నం టిఆర్‌ఎస్‌ క్యాండేట్‌ కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి నామినేషన్‌ సమర్పిస్తారు. ఈ నెల 14 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ఇప్పటివరకూ ఒకే ఒక నామినేషన్‌ మాత్రమే పడింది. భారీ ర్యాలీతో నామినేషన్‌ వేసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రెడీ అవుతున్నారు.

ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌తో పాటూ స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ వివేక్, ఈటల రాజేందర్‌, కేంద్రమంత్రులు కిషన్​రెడ్డి, భుపేంద్ర యాదవ్​, లక్ష్మణ్​, డీకే. అరుణ హాజరుకానున్నారు. వీరితో పాటు మునుగోడు బిజెపి స్టీరింగ్‌ కమిటీ నేతలు హాజరవుతారు. ఇటు టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రభాకర్‌ రెడ్డి కూడా భారీ ర్యాలీతో నామినేషన్‌ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు పాల్గొంటారు. మునుగోడు నుంచి చండూరు వరకు భారీ ర్యాలీతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/