పోలీసు అమరవీరుల దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న సిఎం జగన్‌

AP CM YS Jagan Mohan Reddy
AP CM YS Jagan Mohan Reddy

విజయవాడ: ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సిఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశమంతా పోలీస్ అమరవీరులను స్మరించుకునే రోజు. కోవిడ్ సమయంలో పోలీసులు అమూల్యమైన సేవలు అందించారు. రాష్ట్ర హోంమంత్రిగా మహిళను నియమించాం. రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశా పోలీస్‌స్టేషన్లను తీసుకొచ్చాం. దిశా బిల్లును కేంద్రాని కూడా పంపించాం. మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి, జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ జారీ చేస్తాం. నాలుగు దశల్లో 6500 పోస్టుల భర్తీ చేస్తాం. పోలీస్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లిస్తాం’ అని సిఎం జగన్‌ పేర్కొన్నారు. ఈసందర్భంగా పోలీసుల నుండి సిఎం గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్, హోంమంత్రి సుచరిత, మంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/