కోళ్లకు అంతుచిక్కని వైరస్‌.. మృత్యువాత

Poultry farm
Poultry farm

ఖమ్మం: తెలంగాణలో అంతుచిక్కని వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది. ఆ వైరస్ సోకి వేలాది మూగ జీవాలు మృత్యువాత పడటంతో గుండెలు గుబేల్ మంటున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 వేల కోళ్లు అంతు చిక్కని వైరస్ కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నాయకులగూడెం, వరంగల్ రూరల్‌కు చెందిన ఖానాపురంలో వేలాది కోళ్లు చనిపోయాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చనిపోయిన కోళ్ల నమూనాలు సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపారు. నాయకులగూడెం ఏపీకి సరిహద్దులో ఉండగా.. ఇటీవల ఏపీలోనూ అనేక కోళ్లు మృతి చెందాయని, అదే వైరస్‌ ఇప్పుడు తమ ప్రాంతానికి వచ్చిన ఫలితంగానే కోళ్లు మృతిచెంది ఉంటాయని వ్యాపారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ వైరస్ వ్యాపించి మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉందని అంటున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/