షూటింగ్ బ్రేక్ లో క్రికెట్ ఆడుతున్న డైరెక్టర్ త్రివిక్రమ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ క్రికెట్ ఆడుతూ యూనిట్ సభ్యులను పరుగులు పెట్టించాడు. ప్రస్తుతం త్రివిక్రమ్..సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ మూవీ..శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.కాగా షూటింగ్ బ్రేక్ సమయంలో యూనిట్ సభ్యులతో కలిసి త్రివిక్రమ్ క్రికెట్ ఆడుతున్నాడు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. త్రివిక్రమ్ బ్యాట్ పట్టుకొని,యూనిట్ సభ్యులను పరుగులు పెట్టిస్తున్నారు.

ఈ సినిమాలో పూజ హెగ్డే కథానాయిక కాగా, మరో కీలక పాత్రలో శ్రీలీల కూడా కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. వచ్చే ఆగస్టు 11న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.