ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు

రెండు రోజుల విరామం అనంతరం బుధవారం ప్రారంభం

pocharam srinivas reddy
pocharam srinivas reddy

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రెండు రోజు విరామం అనంతరం ఈరోజు తిరిగి ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలిలో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి లు సమావేశాలకు అధ్యక్షత వహించారు. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. ప్రశ్నోత్తరాల అనంతరం ఉభయ సభల్లోనూ బడ్జెట్‌పై సాధారణ చర్చను చేపట్టనున్నారు. బడ్జెట్‌పై చర్చను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభిస్తారు. ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు తీర్మానాన్ని బలపరుస్తారు. మండలిలో చర్చను పురాణం సతీశ్‌ ప్రారంభిస్తారు. గంగాధర్‌గౌడ్‌ బలపరుస్తారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/