వామ్మో..కేబుల్ బ్రిడ్జిఫై కార్ నడిపేందుకు ట్రై చేసారు

కళ్ల ముందు పదుల సంఖ్య లో ప్రాణాలు పోయిన కొంతమంది మాత్రం మారడం లేదు. తప్పు అని తెలిసిన..ఆ పని చేస్తే ప్రాణాలు పోతాయని తెలిసిన మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. ఆదివారం గుజరాత్ లోని మోర్బీ జిల్లాలోని మచ్చు నదిపై 150 ఏళ్ల క్రితం నిర్మించిన తీగల వంతెన కూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 141 మంది వరకు ప్రాణాలు విడిచారు. పెద్ద ఎత్తున ఒకేసారి బ్రిడ్జి ఫై నిల్చువడం తో వంతెన తెగినట్లు చెపుతున్నారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన గురించి ఇంకా మాట్లాడుకుంటుండగానే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

కర్ణాటకలో ఓ కేబుల్ బ్రిడ్జిపైకి కొందరు టూరిస్టులు ఏకంగా కారుని ఎక్కించి నడిపే ప్రయత్నం చేసిన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉత్తర కన్నడ జిల్లా యెల్లపురాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శివపుర కేబుల్ బ్రిడ్జిపై ఈ ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన కొందరు టూరిస్టులు సస్పెన్షన్ బ్రిడ్జిపైకి ఏకంగా కారును తీసుకొచ్చారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని అడ్డుకున్నారు. కారు బరువు కారణంగా వంతెన కూలే ప్రమాదం ఉందని హెచ్చరించి వారిని వెనక్కి పంపించారు. అయినా వాళ్లు వినిపించుకోకుండా స్థానికులతో వాగ్వాదం చేస్తూ కారును వంతెనపై కొంతదూరం తీసుకొచ్చారు. స్థానికులు గట్టిగా అభ్యంతరం చెప్పడంతో టూరిస్టులు తగ్గారు. కారును వెనక్కి తీసుకెళ్లారు. కారుని వెనక్కి తీసుకెళ్లడంతో స్థానికులు కూడా సాయం చేశారు. ఆ విధంగా ప్రమాదం నుంచి తప్పించారు. తీగల వంతెనపై కారుని వెనక్కి తీసుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.