అనంతపురం జిల్లాలో విషాదం : విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు వ్యవసాయ కూలీల మృతి

అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం దర్గాహోన్నూరు విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్‌ ఫై వెళ్తున్న కూలీలఫై విద్యుత్ తీగలు తెగిపడటంతో ఆరు మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన కూలీలు పొలంలో మొక్కజొన్న కంకుల కోతకు వెళుతుండగా విద్యుత్ మెయిన్ వైర్లు ఒక్కసారిగా తెగిపడ్డాయి. దీంతో ఆరుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. సంఘటనా స్థలిలో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. వెంటనే సమీప గ్రామస్తులు అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో దర్గాహోన్నూరులో విషాదఛాయలు అలముకున్నాయి.

నాల్గు నెలల క్రితం ఇదే మాదిరి సత్యసాయి జిల్లా లో వ్యవసాయ కూలీలు ఆటోలో వెళ్తుండగా..వీరు ప్రయాణిస్తున్న ఆటో ఫై ఒక్కసారిగా హై టెన్షన్ విద్యుత్ తీగలు తెగి ఆటోమీద పడ్డాయి. క్షణాల్లోనే మంటలు ఆటో మొత్తాన్నీ చుట్టు ముట్టాయి. ఏం జరుగుతోందో అర్థమయ్యే లోపే.. లోపల ఉన్న కూలీలకూ మంటలు అంటుకున్నాయి. ఆటో లో ఉన్నంత వారు హాహాకారాలు.. ఆర్తనాదాలతో ప్రాణాలు దక్కించుకునేందుకు అందరూ ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఈ ప్రమాదం లో ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఇక ఇప్పుడు అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.