అన్నయ్య కు..తమ్ముడు బర్త్ డే విషెష్

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా ఉదయం నుండి అభిమానులు , సినీ , రాజకీయ , ఇతర రంగాలకు చెందిన వారంతా పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో ఆయనకు బెస్ట్ విషెష్ అందజేస్తూ వారి అభిమానాన్ని , ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి తమ్ముడు సినీ నటుడు , జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య కు ట్విట్టర్ వేదికగా తన ప్రేమను వ్యక్తం చేసారు.
‘నేను ప్రేమించే, గౌరవించే.. ఆరాధించే నా ప్రియమైన సోదరుడికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఈ ప్రత్యేకమైన రోజున మీకు మంచి ఆరోగ్యం, విజయం, కీర్తి దక్కాలని కోరుకుంటున్నాను అంటూ పవన్ ట్విట్టర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపాడు.
అలాగే మేనల్లుడు , హీరో సాయిధరమ్ తేజ్ తన ట్విట్టర్ లో ‘నా ఇన్‌స్ప్రేషన్.. నా ప్రియమైన మామ.. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి. మీరు సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించాలని.. జీవితంలోని ప్రతి రంగాలలో మాకు ఇలా స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశాడు. వీరితో పాటుగా వరుణ్‌తేజ్, శ్రీకాంత్, హరీష్ శంకర్ ఇలా పలువరు సినీ సెలబ్రెటీలు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ జేస్తున్నారు.
ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే…గాడ్ ఫాదర్ , భోళా శంకర్ తో పాటు బాబీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు.