రాహుల్ ఫై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలఫై ఉత్తమ్ ఆగ్రహం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫై టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల ఫై ఉత్తమ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హ‌త కేటీఆర్‌కు ఉందా? అని ఉత్త‌మ్ మండిప‌డ్డారు. శుక్రవారం కేటీఆర్ మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 90 స్థానాల్లో విజయం సాదించబోతుందని , మరోసారి కేసీఆర్ సీఎం అవుతారని , రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని, సిరిసిల్ల‌కు రాహుల్ వ‌స్తే స్వాగ‌తిస్తాం.. వ‌చ్చి నేర్చుకోమ‌నండి అని కేటీఆర్ సూచించారు. ఈ వ్యాఖ్యలపై ఉత్తమ్ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీపై కేటీఆర్ వ్యాఖ్య‌లు అహంకార‌పూరిత‌మైన‌వేన‌ని ఆయ‌న అన్నారు. కేటీఆర్ ఎంత‌?… ఆయ‌న స్థాయి ఎంత? అని కూడా ఉత్త‌మ్ ప్ర‌శ్నించారు.

శ్రీలంక‌లో రాజ‌ప‌క్స కుటుంబానికి ప‌ట్టిన గ‌తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ కుటుంబానికి త‌ప్ప‌ద‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. ప్రతి పార్టీ వాళ్లు.. వారికి అనుకూలంగా సర్వే చేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన కేసీఆర్కు అసెంబ్లీ రద్దు చేసే దమ్ము ఉందా..? అని ప్రశ్నించారు. దమ్ముంటే ఈ క్షణంలో అసెంబ్లీ రద్దు చేయాలని.. తాము ఎన్నికలకు సిద్ధమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు అప్పులకుప్పగా మారి ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.