క్షమాపణలు చెప్పిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్

U.K. PM Rishi Sunak apologises for removing car seat belt

బ్రిటన్ః బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్షమాపణలు చెప్పారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోకుండా తప్పు చేసినట్లు అంగీకరించారు. రిషి గురువారం నార్త్ – వెస్ట్ ఇంగ్లండ్‌లో డ్రైవింగ్ చేస్తున్న సమయంలో వీడియో తీసుకునేందుకు గానూ తన సీటు బెల్టును తీసేశాడు. ఈ వీడియో కాస్తా వైరల్‌ కావడంతో వివాదం రాజుకుంది. ఇది గ్రహించిన రిషి సునాక్‌.. నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ క్షమాపణలు చెప్పారు. ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ ధరించాలని కోరారు.

యూకే చట్టాల ప్రకారం. బ్రిటన్‌లో కారులో ప్రయాణించే సమయంలో ప్రతిఒక్కరూ తప్పని సరిగా సీటు బెల్టు ధరించాల్సి ఉంటుంది. అత్యవసర వైద్యం పొందాల్సిన వ్యక్తి మినహా ప్రతీఒక్కరూ సీటు బెల్టు ధరించాల్సిందే. తేదంటూ డ్రైవర్లు, ప్రయాణీకులకు భారీగా జరిమానా విధిస్తారు. సుమారు 100 పౌండ్ల వరకు జరిమానా ఉంటుంది. ఒక్కోసారి కోర్టుకుసైతం వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు జరిమానా 500 ఫౌండ్లకు పెరగొచ్చు కూడా.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/