నేడే పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు రాయితో చెల్లించేందుకు ఆఖరి రోజు

పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇంకా మిగిలినవారు కూడా సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ఇదే చివరి ఛాన్స్ అని.. గడువు పెంచే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. ద్విచక్రవాహనాలు(Bikes ), ఆటో(Auto)లకు 80శాతం, ఆర్టీసీ (RTC) బస్సులకు 90శాతం, ఇతర వాహనాలకు 60శాతం రాయితీతో పెండింగ్ చలాన్లు చెల్లించుకోవచ్చు.

గతేడాది డిసెంబర్ 27నుంచి పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు పోలీసుశాఖ అవకాశం కల్పించింది. తొలుత 15 రోజులు మాత్రమేనని తెలిపిన పోలీసుశాఖ( TS Police)…సాంకేతిక కారణాలతో పలుమార్లు సర్వర్‌ మొరాయించి ఇబ్బందులు తలెత్తడంతో ఈ నెలాఖరి వరకు గడువు పొడిగించింది. దీంతో పెంచిన గడువు నేటితో ముగియనుండడంతో…ఇంకా చలాన్లు పెండింగ్‌లో ఉన్నవారు ఎవరైనా సరే ఆన్‌లైన్‌ ద్వారా త్వరగా చెల్లించాలని పోలీసుశాఖ అలర్ట్‌ ఇచ్చింది.