రేపటి నుండి కర్ణాటక లో గృహ లక్ష్మి పథకం ప్రక్రియ ప్రారంభం

కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయానికి కారణం అక్కడ కురిపించిన హామీలే. వాటిలో గృహ లక్ష్మి పథకం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ఈ పధకం ద్వారా ఇంటి పెద్ద అయిన మహికు ప్రతి నెలా రూ.2, 000 ఇస్తామని ప్రకటించింది. ఇచ్చిన హామీ ప్రకారం రేపు సీఎం సిద్దరామయ్య ఈ పధకాన్ని ప్రారభించబోతున్నారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దానిని ప్రసారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే శక్తి పథకం, అన్న భాగ్య పథకాలను కర్ణాటక ప్రభుత్వం అమలు చేసింది. ఇప్పుడు కర్ణాటక మహిళలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న గృహలక్ష్మి పథకం కూడా అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈనెల 16వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు బెంగళూరులో ప్రతిపక్ష నేతల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. జులై 18న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుంతుందని, అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాలో ఆగస్టు నెల నుంచి రెండు వేల రూపాయలు జమ చేస్తామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని, సుస్థిర ప్రభుత్వం మా లక్ష్యమని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ అన్నారు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని, సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి నెల రోజుల్లో అందరి ఖాతాల్లో డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేస్తుందని పేర్కొన్నారు.