తమ భేటీ రాజకీయ వర్గాల్లో కాక పుట్టిస్తుంది :కోమటిరెడ్డి

కోమటిరెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి..రేవంత్ ను సాదరంగా ఆహ్వానించిన కోమటిరెడ్డి

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు సమావేశం కావడం కాంగ్రెస్ వర్గాల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఈ సమావేశంపై కోమటిరెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు. “రేవంత్ రెడ్డి ఇవాళ మా ఇంటికి వచ్చారు. ఆయనను సాదరంగా స్వాగతించాను. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఇరువురం చర్చించాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో మేం మార్పు తీసుకురాగలమని భావిస్తున్నాం” అని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, తమ భేటీకి సంబంధించిన ఫొటోలను కూడా కోమటిరెడ్డి ట్విట్టర్ లో పంచుకున్నారు. రాజకీయ వర్గాల్లో ఈ ఫొటోలు కాక పుట్టించడం ఖాయం అని వ్యాఖ్యానించారు.

గతంలో టీపీసీసీ పదవి విషయంలో కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారంటూ అప్పట్లో కథనాలు వచ్చాయి. కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీ చీఫ్ పదవిని రేవంత్ కు ఇచ్చినప్పటినుంచి కోమటిరెడ్డి తన పంథాలో పయనిస్తున్నారు. ఇన్నాళ్లకు ఇరువురు కలవడం కాంగ్రెస్ పార్టీకి సానుకూల పరిణామం అని చెప్పాలి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/