వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు త‌మ‌నే ఆద‌రించాలి : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురుదాస్ పూర్‌, హోశీర్‌పూర్ ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఎలాంటి ప్ర‌యోగాలకు దిగొద్దని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణం అభివృద్ధికి ఎంతో తోడ్ప‌డుతుంద‌ని, ఈ ప్ర‌శాంత వాతావ‌ర‌ణం కాంగ్రెస్‌తోనే సాధ్య‌మ‌వుతుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. పంజాబ్ వాతావ‌ర‌ణాన్ని, సంస్కృతిని త‌మ పార్టీ పూర్తిగా ఆక‌ళింపు చేసుకుంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు త‌మ‌నే ఆద‌రించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. నిరుద్యోగిత రాను రాను తీవ్రంగా పెరిగిపోతున్నా, ప్ర‌ధాని మోడీ మాత్రం ఈ విష‌యంపై మాట్లాడ‌ర‌ని, న‌ల్ల‌ధ‌న విష‌యంపై కూడా స్ప‌ష్ట‌త‌నివ్వ‌ని విమ‌ర్శించారు.

పంజాబ్ వాతావ‌ర‌ణాన్ని, సంస్కృతిని త‌మ పార్టీ పూర్తిగా ఆక‌ళింపు చేసుకుంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు త‌మ‌నే ఆద‌రించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. నిరుద్యోగిత రాను రాను తీవ్రంగా పెరిగిపోతున్నా, ప్ర‌ధాని మోదీ మాత్రం ఈ విష‌యంపై మాట్లాడ‌ర‌ని, న‌ల్ల‌ధ‌న విష‌యంపై కూడా స్ప‌ష్ట‌త‌నివ్వ‌ని విమ‌ర్శించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/