ట్రంప్‌ వ్యాఖ్యలపై స్పందించిన ‌ఆంటోనీ ఫౌజీ

ట్రంప్‌కు తమ ఆరోగ్య అధికారులు ఎప్పుడూ చెప్పలేదు.. డాక్టర్‌ ఆంటోనీ ఫౌజీ

trump-Anthony Fauci

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంపన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో కరోనా కేసులు తగ్గాలంటే పరీక్షలు తగ్గించాలని ట్రంప్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇటివల ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఎక్కువ పరీక్షలు చేస్తే ఎక్కువ కేసులు వెలుగు చూస్తాయని, అందుకే తక్కువ పరీక్షలు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. పరీక్షల్ని తగ్గించాలన్న ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈవిషయంపై అమెరికా కాంగ్రెస్‌ కమిటీ చేపట్టిన దర్యాప్తు సందర్భంగా డాక్టర్‌ ఆంటోనీ ఫౌజీ నేతృత్వంలోని ఆరోగ్య నిపుణులు స్పందించారు. ఈ మేరకు ఆంటోనీ మాట్లాడుతూ.. కరోనా పరీక్షలు ఆలస్యంగా చేయాలని తమ ఆరోగ్య అధికారులు ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. అంతేగాక మరిన్ని ఎక్కువ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించినట్లు వెల్లడించారు. అలాగే తమ అధ్యక్షుడు ట్రంప్‌ కరోనా పరీక్షలు నిర్వహణ తగ్గించాలన్న ఆదేశాన్ని కూడా జారీ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. కరోనాతో దేశమంతా చారిత్రాత్మక సవాళ్లను ఎదుర్కొంటుందని, భవిష్యత్తులో మహమ్మారికి వ్యతిరేకంగా యుద్ధమే చేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/