లండన్ లో నవజాత శిశువుకు కరోనా

ప్రపంచంలో కరోనా పీడిత అత్యంత పిన్న వయస్కుడు

Corona to the newborn
Corona to the newborn

లండన్ : నవజాత శిశువుకు కరోనా సోకిన సంఘటన లండన్ లో వెలుగులోనికి వచ్చింది. ప్రపంచంలో కరోనా వైరస్ బారిన పడిన అత్యంత పిన్న వయస్కుడిగా ఆ నవజాత శిశువు నిలిచాడు.

ప్రసవానికి కొద్ది గంటల ముందు తల్లిని న్యుమోనియా అనుమానంతో ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

వాటి ఫలితం వచ్చేలోగా ఆమె ప్రసవించింది. టెస్టుల్లో ఆమెకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణకావడంతో ఆమెను ప్రత్యేక వార్డుకు తరలించారు.

నవజాత శిశువుకూ కరోనా పరీక్షలు నిర్వహించారు.  ఆ పరీక్షల్లో శిశువుకు కూడా వైరస్ సోకినట్లు తేలింది.

తాజా ‘చెలి ‘శీర్షికల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/