ఇటలీలో ఇద్దరు​ ఉద్యోగులకు కరోనా

న్యూయార్క్ కూ విస్తరించిన వైరస్

coronavirus
coronavirus

ఇటలీ: ఇటలీలోని మిలన్ లో ఉన్న తమ కంపెనీ బ్రాంచ్ లో ఇద్దరు ఉద్యోగులకు కరోనా వైరస్
(కొవిడ్‌-19) సోకినట్టుగా అమెజాన్ సంస్థ ప్రకటించింది. వారిని ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్వారంటైన్ కు తరలించినట్టు తెలిపింది. ‘కరోనా వైరస్ బారిన పడిన ఉద్యోగులకు తగిన సహాయం అందజేస్తున్నాం. వారు ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు’ అని అమెరికాలో అమెజాన్ కంపెనీ ప్రతినిధి డాన్ పెర్లెట్ ప్రకటించారు. కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికాలో మరో మరణం నమోదైంది. ఒక 70 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ కారణంగా మృతి చెందినట్టు వాషింగ్టన్ లోని కింగ్ కంట్రీ హెల్త్ ఆఫీసు ప్రకటించింది. ఇదే ప్రాంతంలో ఇంతకుముందే 50 ఏళ్ల వ్యక్తి ఒకరు వైరస్ తో చనిపోయారు. ఇక అమెరికాలోని న్యూయార్క్ లో ఆదివారం తొలి కరోనా వైరస్ కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/