సిఎం కెసిఆర్‌ ‌కు లేఖ రాసిన కోమటిరెడ్డి

komatireddy venkat reddy
komatireddy venkat reddy

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సిఎం కెసిఆర్‌ ‌కు లేఖ రాశారు. ఎస్ఎల్బీసీ పనుల పెండింగ్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు మరో సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వాలన్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్ట్‌ని త్వరగా పూర్తి చేయాలని కోమటిరెడ్డి లేఖలో కోరారు. బ్రహ్మణవెల్లంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తయినా.. నిధులు లేక 6 కిలోమీటర్ల కాల్వల పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల పూర్తికి నిధులు కేటాయించాలని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. 

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/