ఎన్‌కౌంటర్‌లో లష్కరే అగ్ర కమాండర్ హతం

లష్కరే కమాండర్ కంత్రూతోపాటు మరో ఇద్దరి హతం

శ్రీన‌గ‌ర్ : జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బారాముల్లా సమీపంలోని మాల్వా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకుని గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి.

ఈ ఘటనలో లష్కరే తోయిబా అగ్ర కమాండర్ యూసుఫ్ కంత్రూతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రత్యేక పోలీసు అధికారి, అతడి సోదరుడు, ఓ జవాను సహా పలువురు పౌరుల హత్యల్లో కంత్రూ ప్రమేయం ఉన్నట్టు కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవాన్లు స్వల్పంగా గాయపడినట్టు ఆయన పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/