సీఎం కేసీఆర్ తో మాజీ సీఎం కుమారస్వామి భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాజీ సీఎం కుమారస్వామి భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. దసరా కు జాతీయ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. రీసెంట్ గా బీహార్ వెళ్లి సీఎం నితీష్ కుమార్ తో పాటు పలువురి తో సమావేశమయ్యారు.

ఇక ఈరోజు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యులర్ నేత కుమారస్వామితో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఇరువురు నేతలు సమావేశం అయ్యారు. ప్రధానంగా జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. కేసీఆర్ ఇప్పటికే బెంగళూరు వెళ్లి… మాజీ ప్రధాని దేవగౌడ, కుమారస్వామితో చర్చించారు. ఇప్పటికే 22 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. జాతీయ స్థాయిలో ఉచిత విద్యత్ అంటూ సంచలన ప్రకటన చేసారు. ఈ ప్రకటన జాతీయ స్థాయిలో చర్చకు కారణమైంది. జాతీయ స్థాయిలో నితీష్.. కేజ్రీవాల్..అఖిలేష్ యాదవ్.. తేజస్వి యాదవ్.. లాలూ ప్రసాద్ యాదవ్ తో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహించారు.