ఏపీ పదో తరగతి విద్యార్థులకు శుభవార్త తెలిపిన ఆర్టీసీ

ఏపీలో పదో తరగతి విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. పదో తరగతి విద్యార్థులు.. పరీక్షలకు వెళ్లే టైమ్ లో .. తిరిగి వచ్చే సమయంలో.. ప్రయాణం కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉచితంగా ప్రయాణించేందుకు.. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు బస్సు ఎక్కకా.. కండక్టర్ కు హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుంది. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. విద్యార్థులు హాల్ టిక్కెట్ చూపిస్తే పరీక్షా కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించొచ్చు.

ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకూ పల్లెవెలుగు , సిటీ ఆర్డినరీ సర్వీసులకు వర్తిస్తుంది. ప్రభుత్వం మే 2 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌తో కొంత క్లాష్ వస్తోంది. అందుకే టెన్త్ ఎగ్జామ్స్ తేదీలను అధికారులు మార్చారు. ఏప్రిల్ 27 నుంచి 9 వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలను నిర్వహిస్తున్నారు.

ఏపీలో టెన్త్ పరీక్షలు సబ్జెక్టుల వారీగా ఇలా ఉన్నాయి.

ఏప్రిల్ 27-తెలుగు
ఏప్రిల్ 28-సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 29-ఇంగ్లీష్
మే 2-గణితం
మే 4-సైన్స్ పేపర్‌-1
మే 5-సైన్స్ పేపర్-2
మే 6-సోషల్ ఎగ్జామ్

10వ తరగతి పరీక్షలు అన్నీ ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు జరుగుతాయి. ఫిజికల్, బయోలాజికల్ సైన్స్ ఎగ్జామ్స్ ఉదయం 9.30 గంల నుంచి 12.15 గంటల వరకు నిర్వహిస్తారు. ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ 50 మార్కుల చొప్పున.. మిగతా అన్ని పరీక్షలు 100 మార్కులు ఉంటాయి. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా అవకాశం కల్పించినందుకు టెన్త్ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.