వైరల్ వీడియో : విజయనగరంలో చెత్త ప‌న్ను కట్టలేదని ఇంటి ముందు చెత్త వేసిన మున్సిపల్ సిబ్బంది

ఎక్కడ లేని విధంగా ఏపీలో ప్రజలనుండి చెత్త పన్ను వసూళ్లు చేస్తుంది వైస్సార్సీపీ సర్కార్. దీనిపై ప్రజల నుండి విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వెనుకడుగు వెయ్యడం లేదు. తాజాగా విజయనగరంలో చెత్త ప‌న్ను కట్టలేదని ఇంటి ముందు చెత్త వేశారు మున్సిపల్ సిబ్బంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే..

విజయనగరం జిల్లా కేంద్రంలోని పూల్ బాగ్ అయ్యప్పనగర్​లో సాయిఅమృత రెసిడెన్సీ వాసులు చెత్త పన్ను కట్టడం లేదని మున్సిపల్ సిబ్బంది, స్థానిక వైస్సార్సీపీ నేతలు చెత్తను అపార్ట్​మెంట్ ముందు వేశారు. ఇదేంటని ప్రశ్నించినందుకు దాడికి పాల్పడ్డారని అపార్ట్​మెంట్ నివాసి రవి ఆరోపించారు. తమపై దాడి చేసిన నాయకులు, మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని.. అపార్ట్​మెంట్ వాసులు నిరసన చేపట్టారు. చెత్తపన్ను రద్దు చేయాలని అపార్ట్​మెంట్ వాసులు డిమాండ్ చేశారు. చెత్తపన్ను కట్టకపోతే ఇలా దాడులు చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు.