ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ : భీమ్లా నాయక్ రిలీజ్ వాయిదా

అంత అనుకున్నట్లే సంక్రాంతి బరినుండి పవన్ కళ్యాణ్ తప్పుకున్నాడు. సంక్రాంతి బరిలో రెండు పాన్ మూవీస్ ఉండడం తో థియేటర్స్ సమస్య తో పాటు కలెక్షన్స్ సమస్య ఉండడం తో భీమ్లా నాయక్ చిత్ర నిర్మాతలు తమ సినిమాను వాయిదా వేశారు. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

గత కొద్దీ రోజులుగా ఆర్ఆర్ఆర్ , రాధే శ్యామ్ నిర్మాతలు భీమ్లా నాయక్ సినిమాను వాయిదా వేయాలని అడుగుతున్నప్పటికీ ..నిర్మాత నాగ వంశీ సంక్రాంతికి వస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఈరోజు దిల్ రాజు తో పాటు మరికొంతమంది నిర్మాతలు సినిమా వాయిదా వేయాలని పవన్ కళ్యాణ్, నిర్మాత రాధా కృష్ణ , త్రివిక్రమ్ లను కోరగా..వారు సానుకూలంగా స్పందించి సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. భీమ్లా నాయక్ తప్పుకోవడం తో రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ నిర్మాతలు సంబరాలు చేసుకుంటున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో భీమ్లా నాయక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం అనే సినిమాని భీమ్లా నాయక్ పేరుతో తెలుగులో రీమేక్ గా ఈ సినిమా రూపొందిస్తున్నారు. మలయాళంలో బిజు మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా అక్కడ అయితే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్ర యూనిట్. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. కేవలం పవన్ కోసమే ఆయన తన స్థాయి తగ్గించుకుని మరీ స్క్రీన్ ప్లే రైటర్‌గా మారి సినిమాకు పని చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.