రేపు పోలింగ్ అనగా బిజెపి షాక్ ఇస్తున్న ఓటర్లు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ గా ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ రేపు జరగబోతుంది. గత నెల నెల రోజులుగా ప్రచారం తో హోరెత్తించిన నేతలు..ఇప్పుడు పంపకాల ఫై దృష్టి సారించారు. ఓటుకు మూడు వేల నుండి ఐదు వేల వరకు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటె బిజెపి పార్టీ కి పెద్ద షాక్ ఇస్తున్నారు ఓటర్లు. ఎన్నికల్లో ఓటర్లకు బిజెపి పార్టీ తులం బంగారం ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అయితే తమకు బంగారం ఇవ్వకుండా మూడు వేలు మాత్రమే ఇచ్చారంటూ బీజేపీ నేతలను ఓటర్లు నిలదీసిన ఘటన మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో చోటు చేసుకుంది.

ఓటుకు తులం బంగారం ఇస్తామని చెప్పి రూ.3 వేలు మాత్రమే ఇచ్చారని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయానికి సంబంధించి బీజేపీకి చెందిన కార్యకర్తను ఓటర్లు నిలదీశారు. తులం బంగారం ఇవ్వకుంటే ఓటు వేయబోమని హెచ్చరించారు. ఓటర్లు ఊరు ఊరంతా ఏకమై నేతలపై తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఓటర్లకు సర్ది చెప్పలేక నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరికొన్ని చోట్ల తమకు డబ్బులు పంచడం లేదని గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 10వేలు నగదు, తులం బంగారం ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబధించిన వీడియో వైరల్ అవుతోంది. మరి అన్ని పార్టీల నుండి డబ్బులు తీసుకొని , చివరికి ఎవరికీ పట్టం కడతారో చూడాలి.