సంజయ్ రౌత్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

ముంబయిః మనీ ల్యాండరింగ్ కేసులో సంజయ్ రౌత్‌కు జ్యుడిషియల్ కస్టడీని 14 రోజులు పొడిగించారు. రూ 1034 కోట్ల విలువైన పత్రా చావల్ ల్యాండ్ స్కామ్ కేసులో ఆరు గంటలకు పైగా ప్రశ్నించిన అనంతరం ఆగస్ట్ 1న ఈడీ రౌత్‌ను అదుపులోకి తీసుకుంది. నిందితుడికి రౌత్ సాయం చేశారని, అందుకు ప్రతిగా రౌత్ భార్య వర్షా రౌత్ ఖాతాల్లోకి రూ 1.06 కోట్లు మళ్లించారని ఈడీ ఆరోపిస్తోంది. గోరేగావ్ సబర్బ్‌లోని పత్రా చావల్ అభివృద్ధికి సంబంధించి ఆర్ధిక లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్ట్ చేసింది.
ఈ స్కామ్‌లో రౌత్ ఫ్రెండ్, ప్రధాన నిందితుడు ప్రవీణ్ రౌత్ రూ 112 కోట్ల ఆర్జించారని ఆరోపణలున్నాయి. ప్రాజెక్టును పూర్తి చేయకుండా, 672 మంది నిర్వాసితుల ప్రయోజనాలను పణంగా పెట్టి ప్రాజెక్టు నిధులను దారిమళ్ల్లించేందుకు ప్రవీణ్ రౌత్, రాకేష్ కుమార్ వాధ్వాన్, సారంగ్ వాధ్వాన్‌లు కుట్ర పన్నారని ఈడీ వర్గాలు తెలిపాయి
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/international-news/