గాడ్ ఫాదర్ ఓటిటి రిలీజ్ ఫిక్స్..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఓటిటి ఆడియన్స్ ను అలరించేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని RB చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ 5న తెలుగులో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ని అందుకుంది. కాగా.. థియేటర్స్‌లో మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ‘గాడ్‌ ఫాదర్‌’ హక్కులను సొంతం చేసుకుంది. ఈ మూవీని త్వరలోనే ప్రేక్షకులకి అందుబాటులోకి తెచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం సన్నాహాలు చేస్తోందట. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని నవంబర్ 19న అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ మూవీ లో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించగా , థమన్ మ్యూజిక్ అందించారు.