పార్లమెంట్​లో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ప్రసంగం

YouTube video

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన అరగంట తర్వాత లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. దీని తర్వాత ఆర్థిక మంత్రి 2021-22 ఆర్థిక సర్వేను లోక్‌సభలో సమర్పిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 2 నుంచి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ కార్యకలాపాలు సాగుతాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/