టాలీవుడ్‌ యువ నటుడు మృతి

nanduri udaykiran
nanduri udaykiran

కాకినాడ: తూర్పుగోదావరిజిల్లాలో కాకినాడలో టాలీవుడ్ యంగ్ హీరో మృతి చెందాడు. పరారే పరరె, ఫ్రెండ్స్ బుక్ పలు తమిళ సినిమాలు లో హీరోగా నటించిన నందురీ ఉదయ్ కిరణ్ (34) చనిపోయాడు. నిన్న రాత్రి 10.30 గుండెపోటు రావడంతో అతడ్ని హుటుహుటిన కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో అతడి భౌతిక కాయాన్ని రామారావు పేటలో స్వగృహంకు తరలించారు. ఉదయ్ కిరణ్ మృతిపట్ల పలువురు పెద్దలు , రాజకీయ నాయకులు .. ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/