పూరి పాడ్ కాస్ట్ ల పై ఆసక్తికర వ్యాఖ్య

వ్యక్తిగతంగా నచ్చాయి అంటూ బన్నీ కామెంట్

Allu Arjun
Allu Arjun

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవల పాడ్ కాస్ట్ లతో అభిమానులను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఇందులో కొందరు సెలబ్రిటీ లు కూడా ఉన్నారు.

తాజాగా స్త్రీ పై చేసిన పాడ్ కాస్ట్ పై అభిమానులు ఎక్కువ మంది స్పందిస్తున్నారు.

అద్బుతం అంటూ కొనియాడుతున్నారు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పూరి అభిమానుల్లో చేరి పోయారు.

పూరి గారు పాడ్ కాస్ట్స్ అద్బుతం అని తెలిపారు. చాలా బావున్నాయి అని, వ్యక్తిగతంగా నాకు చాలా బాగా నచ్చాయి అని, నా హృదయ పూర్వక ప్రేమ మీకోసం ..అంటూ తెలిపారు.

పూరి జగన్నాథ్ గారు ఇలాంటి అందమైన టాపిక్స్ ఇంకా చేయాలి అని అన్నారు. ఇందుకు పూర్తి జగన్నాద్ స్పందిస్తూ, నేను మీ ట్వీట్ ను చదువుతూ చాలా ఆనందించాను.

మీలాంటి విజయవంతమైన యువకుడు నుండి ఇది పెద్ద అభినందన అని, ఈ రాత్రి మరొక పెగ్ అదనంగా వేస్తా లవ్ యూ ..అని ముగించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/