హాకీలో భారత జట్టు ఘన విజయం
స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-0తో ఘన విజయం
Tokyo Olympics, Hockey India defeats Spain 3-0
టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా జరిగిన పురుషుల హాకీ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. స్పెయిన్‌తో జరిగిన పూల్-ఎ మూడో మ్యాచ్‌లో 3-0తో అద్వితీయ విజయాన్ని అందుకుంది. ఆట ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన భారత జట్టు అదే ఊపును చివరి వరకు కొనసాగించింది. ప్రత్యర్థికి గోల్స్ చేసే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేసింది.
తొలి క్వార్టర్‌లోనే రెండు గోల్స్ చేసి స్పెయిన్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. నాలుగో క్వార్టర్‌లో మరో గోల్ చేయడంతో విజయం వరించింది. భారత జట్టులో రూపీందర్‌పాల్ 15వ నిమిషంలో ఒకటి, 51వ నిమిషంలో మరో గోల్ చేశాడు. 14వ నిమిషంలో సిమ్రన్‌జీత్ సింగ్ మరో గోల్ చేశాడు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/