SBI ఖాతాదారులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

భారతీయ స్టేట్ బ్యాంకు లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India – SBI) భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు. బ్రాంచీల సంఖ్య, పనిచేయు సిబ్బంది ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. అలాంటి బ్యాంకు ఖాతాదారులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త. బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ( SBI online banking ) సేవ‌లు రెండు గంట‌ల పాటు నిలిచిపోయ‌నున్నాయి.

నిర్వ‌హ‌ణకు సంబంధించిన‌ కార్య‌క‌లాపాలు చేప‌డుతుండ‌టం వ‌ల్ల ఈ రెండు గంటలు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప‌ని చేయ‌ద‌ని ఎస్‌బీఐ ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి 12 గంట‌ల నుంచి 2 గంట‌ల వ‌ర‌కూ 120 నిమిషాల పాటు ప‌ని చేయ‌ద‌ని తెలిపింది. ఈ అసౌక‌ర్యానికి చింతిస్తున్న‌ట్లు తెలిపింది. మెరుగైన బ్యాంకింగ్ సేవ‌లు అందించ‌డానికి ఈ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience.#InternetBanking #OnlineSBI #SBI pic.twitter.com/5SXHK20Dit— State Bank of India (@TheOfficialSBI) September 14, 2021