నేడు ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు నేటితో ముగియనున్నాయి. ఈ ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా ఈ ఫైనల్‌ మ్యాచ్‌లు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ విశాఖకు రానున్నారు. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు ఆయన బహుమతులు అందజేయనున్నారు.

విజేతలకు నగదు పురస్కారాలు, బహుమతులు అందజేయనున్నారు. కాగా వివిధ క్రీడల్లో 25.40 లక్షల మందికి పైగా క్రీడాకారులు పోటీ పడ్డారు. ఇకపై ఈ పోటీలను ఏటా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ పీఎం పాలెం వైఎస్సార్‌ క్రికెట్‌ స్టేడియంలో క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ వీక్షిస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగిస్తారు. ఆ తర్వాత విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి రాత్రికి తాడేపల్లి చేరుకుంటారు.