కర్పూరి ఠాకూర్‌ కుటుంబ సభ్యులతో ప్రధాని మోడీ

pm-modi-meets-karpoori-thakur-family-members

న్యూఢిల్లీః ‘భారతరత్న’కు ఎంపికైన బిహార్‌ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరి ఠాకూర్‌ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర మోడీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి ఠాకూర్‌ కుటుంబాన్ని ఆహ్వానించారు. ఠాకూర్‌ కుమారుడు, జేడీ(యూ) నేత రామ్‌నాథ్‌ ఠాకూర్‌ సహా కుటుంబ సభ్యులతో మోడీ ముచ్చటించారు.

‘‘జన నాయకుడు కర్పూరి ఠాకూర్‌ కుటుంబాన్ని కలవడం ఎంతో సంతోషంగా ఉందని మోడీ అన్నారు. సమాజంలోని వెనకబడిన తరగతులు, అణగారిన వర్గాలకు ఆయన అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ఆయన జీవితం, ఆదర్శ సూత్రాలు దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని తెలిపారు. మరోవైపు తన తండ్రిని ‘భారత రత్న’తో గౌరవించినందుకు ప్రధానికి రామ్‌నాథ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్షణాలు తమకు మరో దీపావళి అంటూ హర్షం వ్యక్తం చేశారు. అనునిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం, సామాజిక మార్పు కోసం కృషి చేసిన కర్పూరిని ఇటీవల కేంద్రప్ర భుత్వం భారతరత్నతో గౌరవించిన విషయం తెలిసిందే.