నేడు ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్బంగా ఘాట్ వద్ద నివాళ్లు అర్పించిన జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

నేడు సీనియర్ ఎన్టీఆర్ 27వ వర్ధంతి. ఈ సందర్బంగా ఆయన మనవళ్లు, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్ కు నివాళులు అర్పించారు. తెల్లవారుజామునే ఘాట్‌ దగ్గరకు చేరుకుని అంజలి ఘటించారు. తాతతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.. సీఎం ఎన్టీఆర్..సీఎం ఎన్టీఆర్ అని నినాదాలు చేయడం ఎన్టీఆర్‌కి ఒకింత ఇబ్బంది కలిగించింది.

ఎన్టీఆర్27వ వర్థంతి సందర్భంగా ఈరోజు పలు సేవా కార్యక్రమాల్ని చేపట్టారు అభిమానులు. యుగపురుషుడు ఎన్టీఆర్ అంటూ అభిమాన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. టీడీపీ శ్రేణులు రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌లో ఎన్టీఆర్ కు నివాళి అర్పించనున్నారు చంద్రబాబు.