జవాన్ నుండి సరికొత్త పోస్టర్..గుండుతో బాద్షా కిరాక్

బాలీవుడ్ బాద్ షా – అట్లీ కలయిక లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ‘జవాన్’. సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడ్ చేసారు. ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ అయ్యి ఆసక్తి రేపగా..తాజాగా మరో స్టైలిష్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో షారుఖ్..చేతిలో రివాల్వర్ పట్టుకొని గుండుతో కనిపించాడు.

ఈ సినిమాకి, అనిరుధ్ సంగీతాన్ని అందిస్తుండగా.. నయనతార, విజయ్ సేతుపతి , ప్రియమణి , యోగిబాబు ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. సంజయ్ దత్ , విజయ్ , అల్లు అర్జున్ , దీపిక పదుకొణే అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. షారుక్ సొంత బ్యానర్లో .. భారీ బడ్జెట్ తో నిర్మితమైన సినిమా ఇది. ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.