నేడు మోడీ, అమిత్ షాతో గవర్నర్ తమిళి సై భేటీ

న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్ తమిళి సై ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ప‌ర్య‌ట‌న‌ భాగంగా ఈరోజు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో గ‌వ‌ర్న‌ర్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. నిన్న ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ కుమారుడి వివాహంలో పాల్గొన్నారు తమిళిసై. కుశక్ రోడ్ లో జరిగిన వేడుకల్లో పాల్గొని వధువరులను ఆశీర్వదించారు. ఈరోజు మోడీ, అమిత్ షాలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈనెల 6, 7 తేదీల్లో ఢిల్లీలో పర్యటించిన గవర్నర్…రాష్ట్రంలో డ్రగ్స్, అవినీతి, రాజకీయ పరిస్థితులపై మోడీ, అమిత్ షాలకు నివేదిక అందజేశారు. ప్రోటోకాల్ కల్పించకపోవడంపై మీడియాతో మాట్లాడారు. అయితే ఈ నెల 11, 12 తేదీల్లో గవర్నర్ భద్రాచలం వెళ్లినప్పుడు కూడా ప్రభుత్వం, అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. దీనిపై గ‌వ‌ర్న‌ర్ ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల‌తో భేటీపై చ‌ర్చించే అవ‌కాశ‌ముంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/