శృంగారం ఫై ప్రియాంక చోప్రా బోల్డ్ కామెంట్స్

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా శృంగారం ఫై బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న క్రమంలో హాలీవుడ్ లో అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సమయంలోనే అమెరికా పాప్ సింగర్ నిక్‌ జోనాస్‌ ను పెళ్లి చేసుకొని వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఇద్దరు తన దాపత్య జీవితాన్ని హ్యాపీగా కొనసాగుతూనే వృత్తి పరంగా అలరిస్తున్నారు. తాజాగా ప్రియాంక లవ్ ఎగైన్ అనే వెబ్ సిరీస్ లో నటించగా..అది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ క్రమంలో ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లలో పాల్గొన్న ప్రియాంక..బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. శృంగారం గురించి ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ డేట్ లోనే సెక్స్ కి మీరు అంగీకరిస్తారా అంటూ యాంకర్ ఆమెను ప్రశ్నించింది. ఫస్ట్ డేట్ లోనే శృంగారం చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. అలాంటప్పుడే అతను రొమాంటిక్ అవునో కాదో తెలుస్తుంది కదా అని పేర్కొంది. ఒకవేళ రొమాంటిక్ కాకపోతే అప్పటితో ఆ ఫేక్ నెంబర్ కి గుడ్ బై చెప్పవచ్చని ఆమె పేర్కొనడం గమనార్హం.