నేడు సీఎం జగన్ బస్సు యాత్రకు విరామం

సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు శుక్రవారం విరామం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోకి యాత్ర ప్రవేశించగా.. చింతారెడ్డిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రంలోనే ఈరోజు సీఎం జగన్ ఉంటారు. శనివారం ఉదయం తిరిగి యాత్ర ప్రారంభం అవుతుంది. ఎల్లుండి సాయంత్రం 4గంటలకు కావలిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రతో జనంలోకి దూసుకెళ్తోంది. ఐదేళ్ల కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ..ప్రతిపక్ష పార్టీల ఫై విమర్శల వర్షం కురిపిస్తూ జగన్ తన యాత్రను కొనసాగిస్తున్నారు. జగన్ యాత్రకు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. మండుఎండను సైతం లెక్క చేయకుండా జగన్ కోసం జనం తరలివస్తుండడం తో గెలుపు ధీమా నేతల్లో రోజుకు రోజుకు ఎక్కువయిపోతుంది. కిందటి నెల 27వ తేదీన కడప జిల్లా ఇడుపుల పాయ వద్ద పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యాత్రను ప్రారంభించారు.