పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంపై ప్రధాని మోడీ ప్రసంగం

PM Modi addresses post-budget webinar on Developing Tourism

న్యూఢిల్లీః పోస్ట్​బడ్జెట్​వెబినార్​లో భాగంగా ఈరోజు ఉదయం ప్రధాని మోడీ ‘డెవలపింక్​టూరిజం ఇన్​ మిషన్​మోడ్’ అనే అంశంపై మాట్లాడారు. ఎప్పుడూ ‘అవుట్​ఆఫ్​ది బాక్స్” ఆలోచన, ‘లాంగ్​టర్మ్​ విజన్​’ దేశ పర్యాటకాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళతాయని ఆయన అన్నారు. భారతదేశంలోని సుదూర ప్రాంతాల్లోని గ్రామాలు ఇప్పుడు టూరిజం మ్యాప్‌లోకి వచ్చాయని ఆయన తెలిపారు. పర్యాటక ప్రదేశాలకు సంబంధించి దేశంలోని బహుళ భాషల్లో సమాచారం అందుబాటులో ఉండేలా యాప్​లను డెవలప్​చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ధార్మిక ప్రదేశాల పునరుజ్జీవనం పర్యాటకాన్ని పెంచిందని, గత ఏడాది కాశీ విశ్వనాథ్ ధామ్‌ను ఏడు కోట్ల మంది సందర్శించారని ప్రధాని ఉద్ఘాటించారు.

శతాబ్దాలుగా ప్రజలు దేశంలో చేస్తున్న వివిధ యాత్రలను ఉటంకిస్తూ.. కొంతమంది అధిక ఆదాయ వర్గాలు టూరిజం ఒక ఫాన్సీ పదం అని అనుకుంటారని,, కానీ భారతదేశంలో టూరిజం సుదీర్ఘ సామాజిక,-సాంస్కృతిక నేపథ్యాన్ని కలిగి ఉందన్నారు. పౌర సదుపాయాలు, డిజిటల్ కనెక్టివిటీ పెరిగి, హోటళ్లు, ఆసుపత్రులు అందుబాటులోకి వచ్చి, పరిశుభ్రతను మెయింటెయిన్​చేస్తే, భారతదేశ పర్యాటక రంగం అనేక రెట్లు అభివృద్ధి చెందుతుందని అన్నారు. డెస్టినేషన్​మ్యారేజ్​లు ఇప్పుడు పెద్ద వ్యాపారమని, దీనికి మన దేశంలో భారీ అవకాశాలు ఉన్నాయని మోడీ తెలిపారు. మనం కనీసం 50 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, భారతదేశాన్ని సందర్శించాలనే వారికి పర్యాటక జాబితాలో కనిపించేలా ఉండాలన్నా