‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ట్విటర్ రివ్యూ

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురాం డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిచిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’. భారీ అంచనాల నడుమ ఈరోజు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ చేసుకుంది. సినిమా చూసిన వారు సినిమా గొప్పగా లేదు కానీ వన్ టైం వాచ్ అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్ వరుకే బాగున్నాయని, కామెడీ పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదని, ఇంటర్వెల్ కూడా ఓకే అన్నట్లుగా ఉందని చెబుతున్నారు.

ఇక సెకండ్ హాఫ్ కూడా పెద్దగా ఏమి లేదని, కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ తప్ప.. సినిమా మొత్తం యావరేజ్ గా ఉందని చెపుతున్నారు. మరికొంతమంది మూవీ స్లోగా స్టార్ట్ అయ్యి ప్రీ ఇంటర్వెల్ టైంకి హైకి వెళ్లిందని, ఫైట్స్ బాగున్నాయి. విజయ్ అండ్ మృణాల్ ప్రెజెన్స్ ఆకట్టుకుందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం బోరింగ్ ఉందని చెబుతున్నారు. బీజీఎమ్ అసలు ఏం బాగోలేదట. సాంగ్స్ ఓకే అనిపించినా డాన్స్ నాట్ ఓకే అంటున్నారు.