బుల్లితెర ఫై హావ చూపించలేకపోయిన RRR

రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలుగా బాలీవుడ్ , హాలీవుడ్ నటి నటులు నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ ఎలాంటి విజయం సాధించిందో..ఎలాంటి కలెక్షన్లు రాబట్టిందో..తెలుగు సినిమా స్థాయిని ఏ మేరకు తీసుకెళ్ళిందో చెప్పాల్సిన పనిలేదు. తెలుగు తో పాటు అన్ని భాషల్లో వసూళ్ల వర్షం కురిపించడమే కాదు అందరి చేత ప్రశంసలు అందుకుంది. ఇక ఓటిటి లో కూడా అదిరిపోయే వ్యూస్ రాబట్టి రికార్డు నెలకొల్పింది. అయితే ఈ సినిమా బుల్లితెర ఫై మాత్రం హావ చూపించలేకపోవడం అందర్నీ షాక్ లో పడేస్తుంది. మాములు సినిమాలే మంచి రేటింగ్ సాగిస్తుంటాయి. అలాంటిది టాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఆర్ఆర్ఆర్ మాత్రం బుల్లితెర ఫై టాప్ 10 లో స్థానం రాబట్టుకోలేకపోవడం షాక్ ఇస్తుంది.

రీసెంట్ గా స్టార్ మాలో ఈ సినిమా తెలుగు వెర్షన్ ఫస్ట్ టైం ప్రసారం చేయగా మంచి రేటింగ్ అయితే అందుకుంది కానీ పాత రికార్డులను మాత్రం ఈ సినిమా బ్రేక్ చేయలేకపోయింది. ముఖ్యంగా టాప్ టెన్ లో కూడా ఈ సినిమా నిలవలేకపోవడం విశేషం. RRR ఫస్ట్ టైం టిఆర్పి రేటింగ్ 19.62 మాత్రమే రాబట్టింది. ఇక నెంబర్ వన్ స్థానంలో అల..వైకుంఠపురములో 29.4 టిఆర్పి తో కొనసాగుతోంది. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు 23.4 , బాహుబలి సెకండ్ పార్ట్ 22.7 , శ్రీమంతుడు 22.54 , పుష్ప 22.54 , డీజే 21.7 , బాహుబలి ఫస్ట్ పార్ట్ 21.54 , ఫిదా 21.31 , గీతగోవిందం 20.8 , జనతా గ్యారేజ్ 20.69 టిఆర్పి లతో టాప్ టెన్ లో కొనసాగుతున్నాయి.