రేపు ఉదయం 11:30 కు ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం

Khairatabad Ganapathi Nimajjanam tomorrow at 11:30 am

హైదరాబాద్‌ః ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం రేపు ఉదయం 11:30 కు జరుగుతుందని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈరోజు బాలానగర్ నుంచి భారీ ట్రాలీ ఖైరతాబాద్ చేరుకోనుంది. అర్ధరాత్రి 12 గంటలకు చివరి పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఒంటిగంట తర్వాత గణపతిని కదిలించనున్నారు.

రేపు ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభమై… టెలిఫోన్ భవన్, సచివాలయం మీదుగా సాగుతుంది. ఉదయం 10:30 గంటలకు క్రేన్ నెంబర్ 4 వద్ద పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కాగా, హైదరాబాద్‌ లో వినాయక నిమజ్జనానికి ట్రై కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జనం సవ్యంగా సాగేలా పోలీసుల ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఈ ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు నిర్వాహకులు. బాలాపూర్ గణేష్ మొదలుకుని హుస్సేన్ సాగర్ వరకు 19 కిలో మీటర్ల శోభాయాత్ర కొనసాగనుంది.అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో సేవలు అందించనున్నట్లు మెట్రో ప్రకటన చేసింది. వినాయక నిమజ్జనం ఉన్న నేపథ్యంలోనే మెట్రో ఈ ప్రకటన చేసింది.