బరువును తగ్గించేందుకు చిట్కాలు

-ఆరోగ్య సూత్రాలు

Tips to lose weight
Tips to reduce weight

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం వెళ్తే సాయంత్రం వరకు ఆఫీసులో కుస్తీ పడుతూ పని భారంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ తీరిక లేని జీవితంలో సమయానికి తినక పోవడం, జింక్‌ ఫుడ్‌ తినడం లాంటివి చేస్తున్నారు. ఫలితంగా నేటి యువతలో చాలా మంది స్థూలకాయులుగా మారుతున్నారు. మళ్లీ ఆ చెడు కొవ్వును కరిగించేందుకుజిమ్‌లో ఆపసోపాలు పడుతున్నారు. అవును ఇది నిజమే.. తగ్గేందుకు కొన్ని చిట్కాలు..

రోజూ వ్యాయామం చేయాలి :

వ్యాయామానికి ఒక్కరోజు కూడా విరామం ఇవ్వకూడదు. ఎందుకంటే చెమట చిందిస్తేనే మీరనుకున్నది సాధించగలరు. క్రమశిక్షణగా జిమ్‌కు వెళ్తూ కసరత్తులు చేయడం ద్వారా క్రమంగా బరువు తగ్గుతారు. మీ మనసులో ఫిట్‌ నెస్‌ అనేది ముందు వరుసలో ఉండాలి.
w వారానికి సరిపడా డైట్‌ ఛార్ట్‌ పెట్టుకోండి : సరైన సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి. పోషకాలుండే ఆహారమేంటో పక్కాగా వారానికి సరిపడా ఛార్జ్‌ను తయారు చేసుకోవాలి. అందుకు సరిపడా ముడి సురుకులను వారానికి సరిపడా తెచ్చుకుంటేమంచిది.

కోరికలను నియంత్రించుకోండి :

ఆకలిని పూర్తిగా నియంత్రించుకోమనిచెప్పం.మీ కిష్టమైన జంక్‌ ఫుడ్‌, కొలెస్ట్రాల్‌అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినే సమయంలో కొంచెం కోరికలు కంట్రోల్‌ చేసుకోండి. అన్నిసార్లూ అవే తినే బదులు కొన్నిసార్లు తింటే చాలు అని అనుకొని మిమ్మల్ని మీరు స్థిమితపరచుకోండి.

మీకు మీరు బహుమతి ఇచ్చుకోండి :

మీరు ఏదైనా కోరుకుంటే దాన్ని మీకు మీరు బహుమతిగా ఇచ్చుకోండి. మీకు నచ్చిన దుస్తులు లేదా ఎక్స్‌ బాక్స్‌ మిషన్ను కొనుక్కోండి. అయితే ఈ విధంగా ఎప్పుడు చేయాలంటే మీ శరీరంలో బరువు తగ్గినట్లు మీకు అనిపిం చినపుడు మాత్రమే చేయండి.అప్పుడే మీకు ప్రేరణ కలుగుతుంది.

Tips to reduce weight

రాత్రి త్వరగా తినండి:

ఎంతో మంది నిపుణులు మొదటగా చెప్పేది రాత్రుళ్లు త్వరగా తినమని. అంతేకాకుండా త్వరగా నిద్రించాలని కూడా చెబుతారు. అవును డిన్నర్‌ను త్వరగా పూర్తిచేస్తే జీర్ణం త్వరగా అవుతుంది. అంత ేకాకుండా రాత్రుళ్లు మంచి నిద్ర కూడా పడుతుంది.

ఉదయాన్నే ఇలా చేయండి :

దయాన్నే చేయాల్సిన మొదటి పని వేడి నీటిలో నిమ్మరసం కలిపి ఆ ద్రావణాన్ని తాగడం అలవర్చుకోండి ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఉదయాన్నే కాఫీకి దూరంగా ఉంటే మంచిది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/