సైకోథెరపీతో రుగ్మతల నివారణ

ఆరోగ్యం- పరిరక్షణ

psychotherapy
psychotherapy

స్త్రీకి మాతృత్వం మరుజన్మలాంటిది అంటారు. పూర్వం ప్రసవసమయంలో కొందరు మహిళలు చనిపోతూ ఉండటమే ఇందుకు కారణం. అంతేకాకుండా మరికొందరిలో పలు శారీరక మానసిక సమస్యలు తలెత్తేవి. సరైన వైద్యసౌకర్యాలు, ఆరోగ్యం పట్ల తగిన అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని అందరికీ తెలుసు.

అయితే గర్భధారణ, గర్భం కొనసాగింపు, ప్రసవం, ప్రసవానంతరం తలెత్తే మానసిక రుగ్మతల పట్ల ఇప్పటికి పూర్తి అవగాహన లేదంటే అతిశయోక్తి కాదు.

ప్రసవసమయంలో సంభవించే మరణాలను మాత్రమే పట్టించుకుని, మానసిక సమస్యలను విస్మరిస్తున్నా రేమో అనిపిస్తుంది.

గర్భధారణ నుంచి ప్రసవానంతరం వరకు శరీరధర్మాలలోను, హార్మోన్లలోను జరిగే మార్పులను గూర్చి మనం అంతగా పట్టించుకోవడం లేదనిపిస్తుంది.

మానసిక ఒత్తిడి, ప్రసవానికి ముందు, ప్రసవానంతరం వచ్చే డిప్రెషన్‌, సైకోసిస్‌లాంటి సమస్యల నివారణ, నివృత్తిపై తగిన శ్రద్ధ కనపర్చడం లేదనిపిస్తుంది.

ఇందుకు నా సమస్యలే తార్కాణం. నా వయస్సు 27 సంవత్సరాలు. బి.టెక్‌ వరకు చదువ్ఞకున్నాను.

మాది కొంత ఉన్నత కుటుంబం కావడంతో ఉద్యోగ ప్రయత్నం చేయలేదు. భర్త ఉద్యోగం చేస్తే చాలు అన్నది మా తల్లిదండ్రుల భావన. నేను కూడా అలాగే భావించాను.

భర్త సంపాదిస్తే, భార్య ఇల్లు, పిల్లలను చూసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాను.

రెండేళ్ల క్రితం మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, మంచి జీతం, సాంప్రదాయకుటుంబం కావడంతో అతనితో నాకు పెళ్లి చేశారు. మావారు మంచి వ్యక్తి. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు.

ఆఫీసులో ఒత్తిడి పెరిగిన సమయంలో ఎప్పుడైనా కొంత చిరాకు, కోపం ప్రదర్శిస్తారు తప్ప మిగిలిన సమయంలో చాలా సరదాగా ఉంటారు.

అయితే గర్భధారణ తర్వాత నాలో మానసిక ఒత్తిడి పెరిగింది. రానురాను డిప్రెషన్‌కు గురయ్యాను. ఎప్పుడు ఏదో దిగులుగా, వెలితిగా అనిపించేది.

ఆరోనెల తర్వాత అనవసర భయం, లేనిపోని భయాలు ఆవహించాయి. అప్పుడప్పుడు ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు అనిపించేది.

ఆ మాటల్లో భయపెట్టే అంశాలే ఎక్కువ వినిపించేవి. ‘నీవ్ఞ ఎక్కువ రోజులు బ్రతకవ్ఞ, ప్రసవసమయంలో చనిపోతావ్ఞ లాంటి మాటలు వినిపించేవి. ఈ విషయం మా అమ్మకు చెపితే భయం వల్ల అలా అనిపిస్తుందని సర్ది చెప్పింది.

డాక్టర్‌ మాత్రం ఒత్తిడి, డిప్రెషన్‌ వల్ల అలాంటి భ్రమలు, భ్రాంతులు కలుగుతాయని, ధైర్యంగా ఉండమని చెప్పి ఏవో మందులు ఇచ్చారు.

అలాగే కొనసాగుతూ ఏడాదిక్రితం ఒక బాబుకు జన్మనిచ్చాను. అయితే నా సమస్య తగ్గలేదు. పైగా కోపం, ఆవేశం కూడా పెరిగింది.

రోజంతా ఎవరో మాట్లాడుతూ భయపెట్టడం ఎక్కువ అయ్యింది. ఈనేపధ్యంలో లండన్‌ లోనే ఒక సైకియాట్రిస్టును కలిశాను. ఆయన నాలో సైకోసిస్‌, ఆడిటరీ హేలూసినేషన్‌ ఉన్నాయని చెప్పి మందులు ఇచ్చారు.

ఏడాది నుంచి మందులు వాడుతున్నప్పటికి నా రుగ్మత తగ్గలేదు. మందులు వాడటం వల్ల ఒక సంవత్సరంలో 20కిలల బరువ్ఞ పెరిగి 80 కిలోలకు చేరుకున్నాను.

వారం క్రితం ఆయన వద్దకు వెళితే మందులు వాడుతూ, సైకాలజిస్టు ద్వారా సైకోథెరపీ చేయించుకోమన్నారు.

మందులతో తగ్గని నా సమస్య మాటలతో తగ్గుతుందా? సైకోథెరపీ అంటే ఏమిటో తెలపండి. అలాగే ఇంకా ఏవైనా మార్గాలు ఉంటే వివరంగా చెప్పండి.

– కౌసల్య, లండన్‌

అమ్మా, మీరు ఈ పేపర్‌లో నా కాలం చూసి, చదివి గూగుల్‌లో నాఫోన్‌ నెంబర్‌ వెదికి విూ సమస్యను తెలపడం సంతోషంగా ఉంది. అలాగే విూరు సమస్యను వివరించిన తీరును బట్టి మీలో సామాజిక, వ్యక్తిగత అవగాహన బాగానే ఉందని భావిస్తాను.

మనలో ఎంత జ్ఞానం, తెలివితేటలు ఉన్నప్పటికి హార్మోన్ల అసమతుల్యత, ప్రతికూల పరిసరాలు, వంశాను గల లక్షణాలు ఇతర పలు అంశాల వల్ల మానసిక రుగ్మతలు తలెత్తుతుంటాయి.

మీరన్నట్టు గర్భధారణ, ప్రసవంలాంటివి మహిళల్లో పలు సమస్యలకు కారణాలుగా పరిణమిస్తుంటాయి.

మన సమాజంలో అధికశాతం స్త్రీలలో గర్భధారణ సమయంలో కొంత ఒత్తిడి ఉంటుంది. శరీరంలో కలిగే మార్పులు, ఇతర సమస్యల వల్ల కొందరిలో ఒక మోస్తరు డిప్రెషన్‌ కలిగే అవకాశాలు ఉన్నాయి.

ఇవన్నీ డాక్టర్ల సలహాలు, అనుభవజ్ఞుల కౌన్సెలింగ్‌తో తగ్గిపోతాయి. ప్రసవిం చిన మూడునాలుగు నెలల్లో తిరిగి శారీరక సామర్థ్యం, ఆరో గ్యం, మానసిక స్థితి సాధారణస్థితికి వచ్చేస్తాయి.

ఇవన్నీ శారీరక, ప్రకృతి ధర్మాలు. అయితే ఒకటి, రెండు శాతం స్త్రీలలో గర్భధారణ సమయం, ప్రసవానంతరం డిప్రెషన్‌, సైకోసిస్‌ లక్షణాలు తలెత్తుతాయి.

ఇందుకు ప్రధానంగా హార్మోన్ల అసమతుల్యతే కారణంగా చెప్పవచ్చు.

ఈదశలో సైకియాట్రిస్టు పర్యవేక్షణలో మందులు వాడటం తప్పనిసరి. అయితే హార్మోన్లతోపాటు మానసికశక్తిని పెంపొందించడం చాలా అవసరం.

విూ సమస్యపట్ల అవగాహన కల్పించ డం, భ్రమలు, భ్రాంతుల నుంచి బయటపడే మార్గాలు సూచించే వారు అవసరం.

అలాగే వద్దనుకున్నా వినిపించే మాటలను తట్టుకునే చిట్కాలు, ఒత్తిడిను నిర్వహించే పద్ధతులు, ఉపశమనమార్గాలు తెలుసుకోవడం మంచిది.

ఇవన్నీ కౌన్సెలింగ్‌ ద్వారా నేర్చుకోవచ్చు. కౌన్సెలింగ్‌ ప్రయత్నాలనే సైకోథెరపి అని, మాటల చికిత్స అని అంటుంటాం.

కాబట్టి మీరు మందులు వాడుతూ సైకాలజిస్టు ద్వారా కోథెరపి చేయించు కుంటే మంచి ఫలితాలు ఉంటా యి.

కాగా మీరు మందులు వాడుతూ ఎక్కువగా విశ్రాంతి స్థితిలో ఉంటే బరువ్ఞ పెరిగిపోతారు. అధిక బరువ్ఞవల్ల ఒత్తిడి, హార్మోన్ల సమస్య పెరుగుతుంది.

కావున రోజు కనీసం అర్థగంట నుంచి గంటసేపు వీలును బట్టి వాకింగ్‌, వ్యాయామాలు చేయండి.

యోగ, ధ్యాన సాధన చేస్తే మరింత మంచిది. అలాగే వీలైనంత వరకు అందరి మధ్య ఉండటం, అభిరుచులను పెంచుకోవడం, కొంత్త విషయా లపై దృష్టిపెట్టడం చేయడానికి ప్రయత్నించండి.

– డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/